కోడిగుడ్లు రెగ్యులర్ గా తింటే డయాబెటిస్‌ వస్తుందా..!?

కోడిగుడ్డు. పోషకాల ఘని. వైద్యులు సైతం కోడి గుడ్లు తీసుకోవాలని సూచనలు చేస్తారు. అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. దీంతో, చాలా మంది కోడిగుడ్డు ఇష్టపడతారు. ఆరోగ్య నిపుణులు సైతం రోజూ కోడిగుడ్డు తీసుకోమని సూచిస్తూ ఉంటారు. అయితే, తాజాగా చేసిన ఒక పరిశోధనలో కోడిగుడ్డు అతిగా తీసుకుంటే మధుమేహం బారిన‌ప‌డే ప్రమాదం ఉంద‌ని తేలింది.
ఇదే సమయంలో రోజూ ఎన్ని వరకు తీసుకోవాలో సూచనలు చేసారు. దీంతో. .ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా కోడిగుడ్డు వినియోగం పైన నిపుణులు కీలక సూచనలు అందిస్తున్నారు.

గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయని.. అందువల్ల ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే అన్ని పోషకాలు అందుతాయని వైద్యులు చెప్తుంటారు. గుడ్డులో అధిక పోషకాలు లభించ డంతో పాటు విటమిన్‌ ఎ, సి, డి, ఇంకా ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉండటంతో అందరూ గుడ్డు తింటున్నారు. అయితే, తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగినట్లు సర్వే ద్వారా స్పష్టమైంది. త‌ర‌చూ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో మ‌ధుమేహం రిస్క్ పెరుగుతున్నట్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవ‌ల్స్ ఎక్కువగా ఉంటున్నట్లు తేలింద‌ని పేర్కొన్నారు. రోజూ 50 గ్రాముల కంటే త‌క్కువగా గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో 25 శాతం, రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ‌ గ‌డ్లు తినేవారిలో 60 శాతం మ‌ధుమేహం రిస్క్ పెరుగుతుంద‌ని నిర్ధారించారు.

 తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్లు షురూ - రూట్.. షెడ్యూల్..!!
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్లు షురూ - రూట్.. షెడ్యూల్..!!
eggs-eating-in-large-quantity-may-increase-the-risk-of-diabetes-study-finds-details-here

నిపుణుల సూచనలు

కాగా, మ‌ధుమేహం వ్యాధి బారిన‌ ప‌డ‌కుండా ఉండాలంటే గుడ్లను ఉడ‌క‌బెట్టుకుని మాత్రమే తిన‌డం ఉత్తమ‌మ‌ని, దానికి ఉప్పు, కారం, కొత్తిమీర లాంటివి జోడించి తీసుకోవాల‌ని అధ్యయనం లో సూచించారు. లేదంటే గుడ్లను కూరగాయలతో కలిపి తీసుకోవాలని సలహా ఇచ్చారు. గుడ్లతో వెజిటెబుల్ ఆమ్లెట్‌లు లాంటివి చేసుకోవటం ఉత్తమం అని పేర్కొన్నారు. గుడ్లను నేరుగా కాకుండా కూర‌గాయ‌లతో క‌లిపి తీసుకోవ‌డం ద్వారా మధుమేహం రిస్క్ త‌క్కువ‌గా ఉండే అవకాశం ఉందని వివరించారు. గుడ్లతో చేసుకునే డిష్‌ల‌లో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడ‌కూడదని హెచ్చరిక చేశారు. కాగా.. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, ఇతర యాంటీ ఆక్సైడ్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+