గుంటూరు జిల్లాలో దొంగనోట్ల ముఠా అరెస్టు
గుంటూరు: వందకు మూడు వందలు ఇస్తామంటూ దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 45 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఒక ఇంటి నుంచి నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్ళి నలుగురిని పట్టుకున్నారు. వీరిలో ఒకరు గతంలో దొంగనోట్ల చలామణి కేసులో నిందితుడు.












Click it and Unblock the Notifications
