వాషింగ్టన్: ఆల్ ఖైదా అధినేత ఓసమా బిన్ లాడెన్ మరణానికి దగ్గరయ్యారని అమెరికన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ సీఐఎ కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వారి సమాచారం ప్రకారం లాడెన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరు నుంచి 18 నెలల పాటు మాత్రమే ఆయన జీవించే అవకాశముంది. సీఐఎ అధికారులు లాడెన్ వాడుతున్న మందుల వివరాలు సేకరించారు. వాటి ప్రకారం లాడెన్ మరెంతో కాలం బతికే అవకాశం లేదు. లాడెన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు గతంలోనే పాక్ అధ్యక్షుడు ముషారఫ్ వెల్లడించిన విషయం తెలిసిందే.