టిడిపి నేత కాట్రగడ్డ బాబు అరెస్టు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడు కాట్రగడ్డ బాబును, ఆయన నలుగురు అనుచరులను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయకుడు వంగవీటి శంతన్ కుమార్ ను హత్య చేసేందుకు వ్యూహం పన్ను తున్నారన్న ఆరోపణతో వారిని అరెస్టు చేశారు. కాట్రగడ్డ బాబు వర్గీయుల నుంచి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. శంతన్, బాబుల మధ్య ఎంతో కాలంగా శతృత్వం ఉంది. ఇరువురిపైన రౌడీ షీట్లు ఉన్నాయి. నాలుగేళ్ళ క్రితం బాబు మనుషులు శంతన్ పై హత్యాయత్నం చేశారు. రెండు సందర్భాల్లోనూ ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
