సచివాలయంలో బాంబు బెదిరింపు
హైదరాబాద్: సచివాలయంలోని సి, డి బ్లాకులకు సోమవారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు వచ్చింది. మొదట డి బ్లాకులో బాంబు పేలనున్నట్లు పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో సి బ్లాకులో బాంబు ఉన్నట్లు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడ కూడా తనిఖీలు ప్రారంభించారు.
సి బ్లాకులో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కార్యాలయం ఉంది. అయితే ముఖ్యమంత్రి మాల్దీవుల పర్యటనలో ఉన్నారు. విస్తృతంగా తనిఖీలు చేసిన అనంతరం బాంబు బెదిరింపులు ఉత్తవేనని తేల్చారు. సచివాలయం సి బ్లాక్ వద్ద మున్సిపల్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications