పదిలోగా మద్దతు ఉపసంహరణ: లెఫ్ట్

న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కి ఈ నెల పదవ తేదీలోగా మద్దతు ఉపసంహరించుకోవాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. యుపిఎకు మద్దతు ఉపసంహరించకుంటూ 10వ తేదీ లోగా రాష్ట్రపతికి వామపక్షాలు లేఖను సమర్పిస్తాయి. ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవవ్రత్ బిశ్వాస్ సోమవారం ఈ విషయం చెప్పారు. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై తమ వైఖరిని వివరిస్తూ యుపిఎ వామపక్షాలకు లేఖ రాసింది. అణు ఒప్పందంపై ప్రభుత్వం ముందుకు సాగుతుందా, లేదా అనే విషయంపై వామపక్షాలు ఈ నెల 7వ తేదీ వరకు గడువు విధించాయి. అయితే ఈ గడువును కాంగ్రెస్ తిరస్కరించింది. దీంతో నాలుగు వామపక్షాలు యుపిఎకు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+