పొత్తు ఉండాలి: టిడిపి నేత కడియం

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంలో తెలంగాణ మేధావుల కోరిక మేరకు నడుచుకుంటామని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు. తమకు పదవులు, సీట్లు ముఖ్యం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ముఖ్యమని, తెలంగాణ రాష్ట్రం కోసం తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవాలని, అప్పుడు పార్టీలో చర్చించి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కెసిఆర్, చంద్రబాబు పొత్తులపై మాట్లాడుకున్నట్లు పత్రికలు వార్తలు రాశాయని, అందువల్ల తానేమీ మాట్లాడబోనని, కెసిఆర్ గానీ చంద్రబాబు గానీ చెప్పి ఉంటే స్పందించే అవకాశం ఉండేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications