హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి తమ కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అదే సమయంలో ఒంటరిగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. నాలుగేళ్లుగా తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని రాజకీయ పార్టీలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తాము అభివృద్ధి చేశాం, చేస్తున్నామని, అందువల్ల ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు తమకే ఉందని ఆయన అన్నారు.