రాష్ట్రపతికి మద్దతు ఉపసంహరణ లేఖ

Prakash Karat
న్యూఢిల్లీ: ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ వామపక్షాల నేతలు బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు లేఖ రాశారు. యుపిఎ ప్రభుత్వం వెంటనే విశ్వాస తీర్మానం ప్రతిపాదించేలా చూడాలని కోరుతూ మరో లేఖను కూడా వారు రాష్ట్రపతిరి అందజేశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ నేతృత్వంలోని నాలుగు వామపక్షాల నేతలు రాష్ట్రపతిని కలిశారు. వామపక్షాల సభ్యులు లోకసభలో 59 మంది ఉన్నారు.

గత నాలుగేళ్లుగా వామపక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నాయి. తాము రాష్ట్రపతిని కలిసి యుపిఎకు మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖ అందజేశామని కారత్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. యుపిఎ- వామపక్షాల స్నేహానికి తెర పడడంతో లోకసభ స్పీకర్ పదవికి సోమనాథ్ ఛటర్జీ రాజీనామా చేయనున్నారు. సోమనాధ్ ఛటర్జీ పార్లమెంటులో సిపిఎం సభ్యుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+