యుపిఎకు వ్యతిరేకంగా ఎండిఎంకె
న్యూఢిల్లీ: అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) భాగస్వామ్య పక్షం ఎండిఎంకె నిర్ణయించుకుంది. యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఎండిఎంకె నాయకుడు వైగో చెప్పారు.
ప్రభుత్వం ప్రతిపాదించే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని తమ నలుగురు పార్లమెంటు సభ్యులకు విప్ జారీ చేయనున్నట్లు అమెరికాలో ఉన్న వైగో ఒక ఆంగ్లదినపత్రిక ప్రతినిధితో చెప్పారు. తమిళనాడులోని డిఎంకె, పిఎంకెలతో పాటు ఎండిఎంకె యుపిఎ భాగస్వామ్య పార్టీగా ఉంటూ వస్తోంది.












Click it and Unblock the Notifications
