గోరింటాకుపై వికలాంగుల ధర్నా
హైదరాబాద్: హీరో రాజశేఖర్ నటించిన గోరింటాకు చిత్రంలో అభ్యంతరకర దృశ్యాలున్నాయని ఆరోపిస్తూ వికలాంగులు బుధవారం హైదరాబాదులోని మాసాబ్ ట్యాంకులో గల సెన్సార్ బోర్టు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మాదిగ దండోరా నాయకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ ధర్నా జరిగింది. వికలాంగులు ఒక సందర్భంలో కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తాము ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని, తాము వివాదాన్ని సృష్టించడం లేదని మందకృష్ణ మాదిగ అన్నారు. తాము వివాదం కోసమే చేస్తుంటే కంత్రీ సినిమాలోని దృశ్యాలను ఆ చిత్ర దర్శకుడు తొలగించి ఎందుకు క్షమాపణ చెప్తారని ఆయన అడిగారు. గోరింటాకు సినిమాలో అభ్యంతరకరమైన సంభాషణలున్నాయంటూ మందకృష్ణ మాదిగ వాటిని ఉదహరించారు. ఆ సన్నివేశాలను తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
