అవినితీ మాయతో దోస్తీయా: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అవినీతిలో కూరుకుపోయిన బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) నేత మాయావతిని వామపక్షాలు ఎలా సమర్థిస్తాయని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ వీరప్ప మొయిలీ ప్రశ్నించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె చీకటి గదిలో, డీప్ ఫ్రీజ్ లో ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నాయకుల్లో విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా ఏ విధమైన ఉత్సాహం, విశ్వాసం కనిపించలేదని ఆయన అన్నారు. తాము మైనారిటీలో పడలేదని, వామపక్షాల మద్దతు ఉపసంహరించిన తర్వాత కూడా తమకు 276 మంది సభ్యుల మద్దతు ఉందని ఆయన చెప్పారు. తమకు 280కి పైగా ఎంపిల మద్దతు ఉందని ఆయన చెప్పారు. నిస్పృహతోనే ప్రతిపక్షాలు యుపిఎపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
