ఇ-మెయిల్: నవి ముంబయిలో వేట

ముంబయి: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి పోలీసులు నవి ముంబయిలోని సంపద ప్రాంతంలో దాడులు నిర్వహించారు. తీవ్రవాదులు ఇక్కడ ఉన్న ఒక ఇంటి నుంచి ఇ-మెయిల్ పంపారని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరించారు. పేలుళ్లకు ఆరుగురు వ్యక్తులు పాల్పడినట్లు పోలీసుల అనుమానం. ఆ ఇంట్లో ఇద్దరు విదేశీయులు అద్దెకున్నట్లు తెలుస్తోంది.

ఇ-మెయిల్ ను ఏదైనా ఇంటి నుంచి పంపారా అనే కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నామని, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల వ్యక్తిగత పరిశీలన జరుగుతోందని, దీనిపై ఇప్పుడే ఏది చెప్పినా తొందరపాటే అవుతుందని పోలీసులు అంటున్నారు. అహ్మదాబాదులో శనివారం జరిగిన 16 వరుస బాంబు పేలుళ్లలో 38 మంది మరణించారు. ఈ పేలుళ్లు బెంగుళూర్ లో జరిగిన పేలుళ్లను పోలి ఉన్నాయి. అహ్మదాబాదులో పోలీసులు ఆదివారంనాడు రెండు పేలని బాంబులను కనుక్కున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+