అన్నా నీ సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదే..?
టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో ఇటీవల ఓ వినూత్నమైన మార్పు మొదలైంది. గతంలో యాక్షన్ సినిమాలు, లవ్ రొమాంటిక్ మూవీస్ ను ఎక్కువగా తీసేవాళ్లు. ఆ తర్వాత హారర్ జానర్ లోనూ సినిమాలు వచ్చాయి. ఇక పూర్తిగా డివోషనల్ జానర్ లోనూ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి పుట్టుకొచ్చింది. అదే డివోషనల్+ మిస్టరీ+ థ్రిల్లర్ .. ఈ కాన్సెప్ట్ తో సినిమా వస్తే అది కచ్చితంగా హిట్ అవుతుందని ఇప్పటి దర్శకులు నమ్ముతున్నారు. కారణం ఏదైనా ఇటీవలి కాలంలో ఈ జానర్ లో సినిమాలు రావడం పెరిగింది.
కాంతార, కాంతార 1 సినిమాలు కూడా ఈ కోవకు చెందినవే. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన ఇరుముడి చిత్రం కూడా డివోషనల్, మిస్టరీ, సస్పెన్స్ ల చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీ కూడా టాలీవుడ్ లో ఏ రేంజ్ బీభత్సం సృష్టించిందో మనం చూశాం. దాదాపు 20 రోజుల నుంచి ఇరుముడి మూవీ బాక్సాఫీస్ వద్ద రోజుకు రూ. కోటి గ్రాస్ ను వసూలు చేస్తూ అఖండ విజయం సాధించింది. మాస్ మహారాజ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇరుముడి. ఇక నిన్న వచ్చిన మహేంద్రగిరి వారాహి చిత్రం కూడా డివోషనల్ ప్లస్ మిస్టరీ చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల్ని మెప్పించింది. అక్కినేని హీరో సుమంత్ నటించిన ఈ మూవీ థియేటర్లలో డీసెంట్ గానే పర్మామ్ చేస్తోంది.
అయితే ఈ సమయంలోనే మాస్ మహారాజ రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా తొలి పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా దీపా బాలు నటించింది. అయితే ఈ మూవీ ట్రైలర్ బాగానే కట్ చేశారు. కానీ థియేటర్లలో మాత్రం ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ తో డీలా పడింది. రోజురోజుకూ కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. దాంతో మారెమ్మ మూవీ బాక్సాఫీసు వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కెరీర్ లో ఫస్ట్ సినిమానే డివోషనల్ ప్లస్ మిస్టరీ కథాంశం దొరకడం ఏ హీరోకైన అదృష్టం లాంటిదే. కానీ మాధవ్ విషయంలో మాత్రం అది బెడిసికొట్టింది. దాంతో మూవీ ఫ్లాప్ టాక్ తో సరిపెట్టుకుంది.

మారెమ్మ మూవీ సెప్టెంబర్ 10 న విడుదల కాగా ఐదు రోజుల్లో ఈ మూవీకి రూ. 35 లక్షల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ థియేటర్ ఖర్చులకే సరిపోలేదని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. రూ. 7 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీకి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications
