విజయరామారావు ఇంటి వద్ద కలకలం
హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయరామారావు ఇంటి వద్ద బాంబు భయం కలకలం సృష్టించింది. ఆయన ఇంటి వద్ద అనుమానాస్పద వస్తువులు కంట పడడంతో ఈ కలకలం చెలరేగింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. బాంబు కాదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బాంబు లాంటి వస్తువు కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తాను చూసి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి వెళ్లిపోయానని విజయరామారావు చెప్పారు. దీంట్లో భయపడాల్సిందేమీ లేదని ఆయన అన్నారు. పౌడర్ చుట్టిన వస్తువుగా దాన్ని పోలీసులు తేల్చారు.












Click it and Unblock the Notifications
