కలిసి దేశవ్యాప్త ప్రచారం: బాబు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి దూరదృష్టి లేదని ఆయన విమర్శించారు. మహా కూటమి ఏర్పాటు ఇప్పుడే సాధ్యం కాదని, అయితే కాంగ్రెస్, బిజెపి కూటములకు వ్యతిరేకంగా కలిసి పని చేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు. మీ కోసం యాత్ర సందర్భంగా ఆయన ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. చంద్రబాబు మీ కోసం యాత్ర రేపు అనంతపురంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే అనంతపురంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 117 రోజులు చంద్రబాబు మీ కోసం యాత్ర సాగింది.












Click it and Unblock the Notifications
