విజయవాడ, పులివెందుల, పిఠాపురంలో అనూహ్య ఫలితాలు- ఎవరెక్కడ లీడ్..!!

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ చాలా చోట్ల పూర్తయింది. కూటమి పార్టీలు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. జగన్, పవన్ సొంత నియోజకవర్గంలో ఫలితాలు ఆసక్తగా మారుతున్నాయి. విజయవాడ కార్పోరేషన్ లో తిలి ఫలితాలు ఆశ్చర్యకరంగా మారుతున్నాయి. కాగా.. మధ్యాహ్నం తుది ఫలితాల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వెల్లడి అవుతున్న ఫలితాల పై ఆసక్తి పెరుగుతోంది.

మున్సిపల్ ఎన్నికల్లో తొలి ట్రెండ్స్ ఆసక్తిగా మారుతున్నాయి. మొత్తం 13 కార్పోరేషన్లలో ఎనిమిది చోట్ల టీడీపీ, మరో చోట జనసేన ఆధిక్యత కొనసాగుతోంది. బీజేపీ పోటీ చేసిన అనంతపురంలో కౌంటింగ్ ఆలస్యంగా జరుగుతోంది. ఏలూరు కార్పోరేషన్ లో జనసేన లీడ్ లో ఉంది. అదే విధంగా మున్సిపాల్టీల్లోనూ కూటమి పార్టీల హవా కొనసాగుతోంది. రాయలసీమ ప్రాంతంలోని పలు వార్డులు మాత్రం వైసీపీ ధీటుగా నిలిచింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వార్డులను సొంతం చేసుకునే విధంగా ముందుకు వెళ్తోంది. ఇక.. విజయవాడ ఆలస్యంగా కౌంటింగ్ మొదలైంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ లో తొలి స్థానంలో వంగవీటి రాధ.. రెండో స్థానంలో అనూహ్యంగా ఏబీ వెంకటేశ్వర రావు నిలిచారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

 ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!!
ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!!
municipal-elections-alliance-parties-maintain-lead-in-initial-results-here-the-latest-trends

మధ్యాహ్నం తరువాత పూర్తి స్పష్టత

కాగా.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పోస్టల్ బ్యాలెట్ లో అనూహ్య ఫలితాలు వెల్లడి అయ్యాయి. పులివెందుల పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ఆధిక్యతలో ఉంది. ఇక్కడ వైసీపీకి 84 ఓట్లు రాగా.. టీడీపీకి 61 ఓట్లు దక్కాయి. పిఠాపురంలో పిఠాపురం పురపాలిక వార్డు ఫలితాల్లో జనసేనకు ఓటర్లు పట్టం కట్టారు. 3,5, 6 వార్డుల్లో జనసేన అభ్యర్ధులు విజయం వైపు దూసుకెళ్తున్నారు. 1,9 వార్డుల్లో స్వతంత్రులు లీడ్ లో ఉండగా.. 2వ వార్డులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యతతో కొనసాగుతు న్నారు. ఏలేశ్వరంలో వైసీపీకి అంచనాకు మించి ఓటింగ్ కనిపిస్తోంది. గుంటూరు కార్పోరేషన్ లో 9 వార్డుల్లో టీడీపీ ఆధిక్యతలో ఉండగా.. వైసీపీ- జనసేన రెండు చొప్పున ఆధిక్యతలో ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యాహ్నం తరువాత ఫలితాల సరళి పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాత్రికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+