పసిడి ధరల్లో పాజిటివ్ ట్రెండ్- రెండో రోజూ
నేడు దేశీయ మార్కెట్లో పసిడి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కొద్దో, గొప్పో వీటి రేట్లు పెరగడం వరుసగా ఇది రెండో రోజు. ఈ పెరుగుదల నామమాత్రమే అయినా మున్ముందు ఇదే ట్రెండ్ కొనసాగుతుందనే అంచనాలకు తెర తీసింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న మార్పులు, ద్రవ్యోల్బణ పరిణామాలు, ఆభరణాల డిమాండ్‌కు అనుగుణంగా బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తోన్నాయి.
సోమవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 270 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 250, 18 క్యారెట్లు రూ. 200 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న భిన్నమైన సంకేతాలు, గ్లోబల్ ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ.. భారత్‌లో బంగారం, ధరల రిటైల్ కొనుగోళ్లు నిలకడగా సాగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వారం మొత్తం కూడా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి అవకాశాలు లేకపోలేదు.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,640వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,28,000గా కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,39,640 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,28,120 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,39,860, రూ. 1,27,800 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,39,640, 22 క్యారెట్లు రూ. 1,28,250 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,964, 22 క్యారెట్లు - రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,473
ముంబై..
24 క్యారెట్లు- రూ. 13,967, 22 క్యారెట్లు - రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,473
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 13,967, 22 క్యారెట్లు - రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,473
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 13,967, 22 క్యారెట్లు - రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,473
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 13,967, 22 క్యారెట్లు - రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,473
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 13,967, 22 క్యారెట్లు - రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,473












Click it and Unblock the Notifications
