GVMC కౌంటింగ్ అప్డేట్ - మేయర్, డివిజన్లలో ఆధిక్యం ఎవరిది ?

విశాఖపట్నం మహానగర పాలక సంస్ధ జీవీఎంసీ(GVMC)లోని మేయర్ తో పాటు 120 డివిజన్లకూ తాజాగా నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. వీటిలో ప్రధాన పోటీ కూటమి పార్టీల అభ్యర్దులకూ, వైఎస్సార్సీపీకి మధ్యే నెలకొంది. ఇందులో కూటమి అభ్యర్దులు పలు చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. అలాగే మేయర్ స్ధానానికి జరిగిన ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలెట్ లో కూటమి అభ్యర్దికి ఆధిక్యం లభించింది.

కూటమి లెక్కల్ని మార్చబోతున్న ఏబీ వెంకటేశ్వరరావు? గెలిచినా, ఓడినా?
కూటమి లెక్కల్ని మార్చబోతున్న ఏబీ వెంకటేశ్వరరావు? గెలిచినా, ఓడినా?

జీవీఎంసీ మేయర్ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్‌లో తాజా సమాచారం అందేవరకూ 838 ఓట్లు లెక్కించారు. ఇందులో కూటమి అభ్యర్ధి ముక్కా శ్రావణికి ఆధిక్యం లభించింది. ఇప్పటివరకూ లెక్కించిన 838 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీకి 384, వైసీపీకి 251, కాంగ్రెస్‌కు 5,
ఇతరులకు 198 పోస్టల్ ఓట్లు లభించాయి. జీవీఎంసీ 120 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లోనూ పార్టీల వారీగా ఆధిక్యాలు ప్రకటిస్తున్నారు.

GVMC Poll Counting NDA Alliance Leads YSRCP in Initial Postal Ballot Trends
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!

ఇందులో 120 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుండగా.. ఇందులో 71 వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యాలు వెల్లడయ్యాయి. వీటిలో టీడీపీ 22 డివిజన్లలో ఆధిక్యం సాధించింది. వైసీపీ 19 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. జనసేన 10 డివిజన్లలో ఆధిక్యం సాధిచింది. బీజేపీ 4 డివిజన్లలో ఆధిక్యంలో నిలిచింది. ఇతరులు 16 వార్డుల్లో ఆధిక్యం సాధించారు. మరో 49 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యాలు కాసేపట్లో వెల్లడికానున్నాయి. ఇప్పటివరకూ ఉన్న కౌంటింగ్ సరళి గమనిస్తే కూటమి మేయర్ తో పాటు డివిజన్లలోనూ హవా కొనససాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మేయర్ స్ధానంలో మాత్రం వైసీపీ అభ్యర్ధి వరుదు కళ్యాణి గట్టి పోటీ ఇచ్చినా ఫైనల్ గా వెనుకబడుతున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+