హైదరాబాద్ మెట్రో రెండో దశపై కీలక అప్డేట్.. రూ.275 కోట్లు మంజూరు చేసిన కేంద్రం!
హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశపైన కేంద్రం నుండి శుభవార్త వచ్చింది. కేంద్రం మెట్రో రెండో దశ నిర్మాణం కోసం మొత్తం రూ.275 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.150 కోట్లు విస్తరణ పనులకు, మిగతా రూ.125 కోట్లు ప్రాజెక్టు రుణాలు చెల్లించడానికి కేటాయించారు. ఈ నిధులు హైదరాబాద్ మెట్రో రెండవ దశపైన నగరవాసుల్లో ఆశలకు ఆర్ఘ్యం పోసింది.
ప్రస్తుత మెట్రో మార్గాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఐటీ ఏరియాలు, పాతబస్తీ, విమానాశ్రయం, శివారు ప్రాంతాలకు ఇంకా సరైన కనెక్టివిటీ లేదు.మొదట రాష్ట్ర ప్రభుత్వం ఐదు కారిడార్లతో 76.4 కిలోమీటర్ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాతో ప్రతిపాదన పంపింది. ఆ తర్వాత నగరం పెరుగుతున్న కొద్దీ అవసరాలు కూడా పెరిగాయి. అందుకే ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల మేర విస్తరించాలని, రూ.38,595 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను మే నెలలో కేంద్రానికి సమర్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిపి విజ్ఞాపనలు అందజేశారు. తమ డీపీఆర్ కు ఆమోదం కోరారు.ప్రతిపాదిత మార్గాల్లో ముఖ్యమైనవి నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గ్ నుంచి కోకాపేట నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి పటాన్‌చెరు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్. ఉత్తరం వైపు మేడ్చల్, శామీర్‌పేట మార్గాలు కూడా ఉన్నాయి.
ఇవన్నీ పూర్తయితే రోజూ ఆఫీసుకు, కాలేజీకి వెళ్లే వారికి చాలా సౌకర్యం మెరుగు అవుతుంది. రోడ్డు మీద రద్దీ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన రూ.275 కోట్లు ప్రాథమిక పనులు, సర్వేలు, డీపీఆర్ అమలు, రుణ బాధ్యతలు నెరవేర్చడానికి ఉపయోగపడతాయి. పూర్తి ప్రాజెక్టు కోసం ఇంకా చాలా నిధులు, అనుమతులు అవసరం.
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఐదు కారిడార్ల భాగాన్ని 2029 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ముందుకు సాగుతాయని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత బలపడాలంటే ఈ విస్తరణ చాలా అవసరంగా ప్రభుత్వం చెప్తోంది. నగరం పెరుగుతున్న కొద్దీ రవాణా వ్యవస్థ కూడా అందుకు తగ్గట్టు అభివృద్ధి చెందాలి. ఈ నిధుల కేటాయింపు ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
