AP Poll Counting: ఏపీ ఉద్యోగుల తీర్పు ఇదే..! పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో క్లారిటీ..!
ఏపీలో 92 పట్టణ స్దానిక సంస్థలకు తాజాగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపును ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించారు. ఉద్యోగులు వేసే పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఓట్ల సరళి ఫలితాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా రెండున్నరేళ్ల కూటమి పాలన తర్వాత ఉద్యోగుల ఆలోచన ఎలా ఉందన్న అంశం ఇందులో వెల్లడవుతోంది.
రాష్ట్రంలో రెండున్నరేళ్ల కూటమి పాలన తర్వాత ఉద్యోగుల అభిప్రాయం ఎలా ఉందన్నది పోస్టల్ బ్యాలెట్లలో కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉద్యోగులు కూటమికి అనుకూలంగానే ఉన్నా, వైసీపీ విషయంలో తీవ్ర వ్యతిరేకత లేదన్నది ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది. కూటమి సర్కార్ లో పీఆర్సీ ఇంకా అమలు చేయకపోవడం, బకాయిల చెల్లింపు ఇంకా జరగకపోవడం వంటి సమస్యలు ఉన్నా.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూటమికి ఆధిక్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ.. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాస్త పుంజుకుంది. దీనికి కారణం ప్రభుత్వంపై ఆయా ప్రాంతాల్లో ఉద్యోగుల వ్యతిరేకత కారణంగా కనిపిస్తోంది. వివిధ కార్పోరేషన్ల పరిధిలో పోటా పోటీగా వైసీపీ మేయర్ అభ్యర్ధులు సాధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఇందుకు నిదర్శనం.

పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో రాయలసీమ పరిధిలోని కడప మేయర్ స్ధానంలో టీడీపీకి 326 వస్తే వైసీపీకి 289 వచ్చాయి. తిరుపతిలో టీడీపీకి 326 వస్తే వైసీపీకి 201 ఓట్లు వచ్చాయి. కర్నూల్లో టీడీపీకి 252 వస్తే వైసీపీకి 156 వచ్చాయి. అనంతపురంలో బీజేపీకి 196 వస్తే వైసీపీకి 176 వచ్చాయి. చిత్తూరులో టీడీపీకి 232 వస్తే వైసీపీకి 221 వచ్చాయి. ఇక కోస్తాంధ్రలో గ్రేటర్ విశాఖ కార్పోరేషన్లో టీడీపీకి 315 వస్తే వైసీపీకి 213 వచ్చాయి. ఏలూరులో టీడీపీకి 223 వస్తే వైసీపీకి 105 వచ్చాయి. విజయవాడలో జనసేనకు 318 వస్తే వైసీపీకి 205 ఓట్లు వచ్చాయి. గుంటూరులో టీడీపీకి 396 వస్తే వైసీపీకి 156 వచ్చాయి. మచిలీపట్నంలో టీడీపీకి 340 వస్తే వైసీపీకి 18 వచ్చాయి.నెల్లూరు కార్పోరేషన్లో టీడీపీకి 126 వస్తే వైసీపీకి 121 వచ్చాయి.













Click it and Unblock the Notifications
