ఆ రోజులు గుర్తొచ్చాయి: చిరంజీవి

హైదరాబాద్: జాతీయ పతాకను ఆవిష్కరిస్తుంటే తనకు విద్యార్థి దశ గుర్తుకొచ్చిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పార్టీ కార్యాలయంలో వికలాంగుల మధ్య జాతీయ పతాకను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎన్ సిసిలో ఉండేవాడినని, ఆ రోజుల్లో జాతీయ పతాకను ఆవిష్కరించేవారమని, ఈ రోజు పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకను ఆవిష్కరిస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చాయని ఆయన అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు స్వీట్లు పంచారు. తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనను ఆయన ఈ నెల 17వ తేదీన చేయబోతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+