టిడిపి హామీల అమలు కమిటీ
అనంతపురం: హామీల అమలు కమిటీ వేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం అనంతపురంలో పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మీ కోసం యాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చ జరిగింది. హామీల అమలుకు వేసిన కమిటీకి యనమల రామకృష్ణుడు చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రావుల చంద్రశేఖర రెడ్డి, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి, కాలువ శ్రీనివాసులు నియమితులయ్యారు.
పోలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకే చంద్రబాబు మీ కోసం యాత్రలో ప్రజలకు హామీలు ఇచ్చారని, అవన్నీ అమలుకు సాధ్యమేనని తెలుగుదేశం పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు చెప్పారు. చంద్రబాబు మీ కోసం యాత్ర శుక్రవారం అనంతపురంలో ముగిసింది. ఆయన 117 రోజుల పాటు ఈ యాత్రను సాగించారు. రెండో విడత మీ కోసం యాత్ర వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని టిడిపి పెద్దగా పట్టించుకోలేదని నాయకులు చెప్పారు. సేవ అనేది టిడిపిలో అంతర్భాగమని వారన్నారు. ఎన్నికల ప్రణాళికలోనే బడ్జెట్ స్వరూపాన్ని తెలియజేయాలని టిడిపి పోలిట్ బ్యూరో నిర్ణయించింది.












Click it and Unblock the Notifications