సమగ్రాభివృద్ధే లక్ష్యం: వైయస్
హైదరాబాద్: రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. రానున్న కాలంలో తీవ్ర ఆహార కొరత రానున్నదని, రాష్ట్రంలో ఆ కొరత రాకుండా తాము వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. సహజ వనరుల వినియోగానికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. తాము గ్రామీణ ప్రాంతాలను మర్చిపోయి హైటెక్ ప్రచారం కోసం వెంపర్లాడడం లేదని, వ్యవసాయనికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు. అదే సమయంలో విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటి రంగాలకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఐటి, విద్యారంగాల్లో రాష్ట్రంలో నెలకొల్పిన వివిధ సంస్థల గురించి ఆయన చెప్పారు. జలయజ్ఞం ద్వారా 15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, వచ్చే మార్చి నాటికి మరో 15 లక్షల ఎకరాలకు నీరందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications