తెలంగాణ: చిరంజీవి, చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర జాప్యం చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం కోసం ఎదురుచూసే ఉద్దేశంతో ఆ పార్టీ ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటైన పార్టీ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ నెల 21వ తేదీన సమావేశం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వరదల కారణంగా ఆ సమావేశాన్ని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసినట్లు ఇటీవల వార్తలు వ్చచాయి. అయితే ఈ నెల 27వ తేదీన కూడా ఆ కమిటీ సమావేశమయ్యే అవకాశాలు లేవు. వచ్చేనెల మొదటి వారంలో ఈ కమిటీ సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తేదీ కూడా నిర్ణయం కాలేదు.

కాగా, చిరంజీవి కూడా తెలంగాణపై ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఈ నెల 26వ తేదీన తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పార్టీ పేరును, విధివిధానాలను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అయితే తెలంగాణపై ఈ సభలోనూ ఆయన కచ్చితమైన నిర్ణయం ప్రకటించే అవకాశం లేదు. తెలంగాణ సున్నితమైన విషయమని, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అయితే తెలంగాణపై ఆయన అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే విషయం అర్థమవుతున్నది.

కాగా, రాజకీయ సమీకరణాలు గతంలో మాదిరిగా ఉండే అవకాశాలు కూడా లేనట్లు అనిపిస్తున్నది. చిరంజీవి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తమతో పొత్తుకు సంప్రదింపులు జరుపుతున్నారని బిజెపి నాయకుడు ప్రకాశ్ జవేదకర్ మంగళవారం చెప్పారు. ఒకవేళ, కెసిఆర్ బిజెపితో పొత్తుకు సిద్ధపడితే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉండవచ్చు. తెరాసతో పొత్తు కోసమే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే ఆలోచన సాగుతోంది. అందువల్ల తెరాస చిరంజీవి పార్టీతోనూ, బిజెపితోనూ కలిసి ముందుకు సాగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ప్రస్తుత వైఖరినే కొనసాగించే ఉద్దేశంతో ఉండవచ్చు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం చెప్పుకుంటూ వస్తున్నది. చిరంజీవి కూడా అదే వైఖరిని కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+