సెప్టెంబర్ 26న పాక్ అధ్యక్ష ఎన్నిక
ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక సెప్టెంబర్ 6వ తేదీన జరగనుంది. అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 6వ తేదీన జరుగుతాయని, ఈ నెల 26వ తేదీ నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చునని ఎన్నికల కమీషన్ కార్యదర్శి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఈ ఎన్నికల్లో పర్వేజ్ ముషార్రఫ్ వారసుణ్ణి ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి సోమవారంనాడు ముషార్రఫ్ రాజీనామా చేశారు. ఖాళీ ఎర్పడిన 30 రోజుల లోగా రాజ్యాంగ నిబంధనల మేరకు అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అధ్యక్ష పదవికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) న్యాయనిపుణులు ఆ పార్టీ నాయకుడు జర్దారీ పేరును ముందుకు తెస్తున్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications