తిరుపతిలో హెచ్ డిఎఫ్ సి రూరల్ బిపివో

ముంబయ్: ప్రైవేటు రంగంలోని రెండో పెద్ద బ్యాంకు అయిన హెచ్ డిఎఫ్ సి దేశంలోని మొదటిసారిగా తిరుపతిలో వాణిజ్య సరళిలో తొలి గ్రామీణ బిపివోను ప్రారంభించింది. తిరుపతి సమీపంలోని గ్రామాల్లోని బలహీన వర్గాల యువతీ యువకులకు ఈ బిపివో ద్వారా చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఈ విషయాన్ని హెడిఎఫ్ సి బ్యాంక్ ఆపరేషన్స్ కంట్రీ హెడ్ ఎ రాజన్ చెప్పారు. జు లై నుంచి ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సి తిరుపతి బిపివోలో 500 మంది ఉద్యోగులు ఉన్నారు. 2009 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 1500 కు పెరుగుతుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.

గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం ఒక ధ్యేయంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, లాభాదాయకతలో ఎటువంటి రాజీ పడబోదని రాజన్ వెల్లడించారు. అలాగే ఖాతాదారులకు అందే సేవల నాణ్యతలో ఎటువంటి రాజీ ఉండబోదని ఆయన తెలియజేశారు. తిరుపతిలోని ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మిగితా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు బిపివోలను నెలకొల్పుతామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+