గణేష్ ను చంపింది భార్యనే
హైదరాబాద్: మాజీ నక్సలైట్ గణేష్ హత్య కేసు మిస్టరీ విడిపోయింది. హైదరాబాదులోని రామంతపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గణేష్ ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తానే గణేష్ ను చంపినట్లు భార్య పుష్ప అంగీకరించింది. సోదరుడు రమేష్ తో కలిసి పుష్ప గణేష్ ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పుష్పను పోలీసులు అరెస్టు చేశారు. రోకలి బండతో కొట్టి తాను గణేష్ ను హత్య చేసినట్లు పుష్ప చెప్పింది.
నయీంతో సంబంధాలున్నాయనే అనుమానంతో గణేష్ పుష్పను నిత్యం వేధించేవాడని, తీవ్రంగా కొట్టేవాడని కూడా చెబుతున్నారు. వేధింపులు భరించలేక తాను గణేష్ ను హత్య చేసినట్లు పుష్ప చెప్పింది. తనకు నయీంతో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications
