జీవనధార తీరుపై విపక్షాల నిరసన
హైదరాబాద్: దళితవాడల్లో రక్షిత మంచినీటి కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ శుక్రవారం శాసనసభలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. కాగా, బహుజన సమాజ్ పార్టీ సభ్యుడు రాజారావు సభ నుంచి వాకౌట్ చేశారు. అంబేడ్కర్ జీవనధార పేరుతో దళిత వాడల్లో 250 కోట్ల రూపాయలతో దళితవాడల్లో రక్షిత మంచినీటి సరఫరాకు పథకాన్ని చేపట్టిందని, అయితే గత మూడున్నరేళ్లలో పైసా కూడా ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు నగేష్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం పెత్తందార్ల కొమ్ము కాస్తూ దళితులను నిర్లక్ష్యం చేస్తోందని వారు విమర్శించారు.
అంతకు ముందు తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, తెరాస, బిజెపి సభ్యులు చేతివృత్తుల పనివారలపై తక్షణ చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే దాన్ని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తిరస్కరించాయి. దాంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. చేతివృత్తుల పనివారలపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో కాసేపు సభలో గందరగోళం చెలరేగింది.












Click it and Unblock the Notifications