పొత్తులపై తొందరలేదు: కెసిఆర్
హైదరాబాద్: పొత్తుల కోసం తొందర లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆదివారంనాడు అన్నారు. పొత్తులపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తమకే వస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ పార్టీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తమకు 40 నుంచి 45 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో నమ్మి టికెట్లిస్తే కొంత మంది మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో అటువంటి పొరపాటు చేయబోమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications