చిరంజీవి అభిమానుల వీరంగం
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం వద్ద చిరంజీవి అభిమానులు శుక్రవారం వీరంగం సృష్టించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లారు. దీంతో వారిని తోసివేసేందుకు చిరంజీవి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. ఈ సమయంలో చిరంజీవి భద్రతా సిబ్బందికి, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన చిన్ననాటి గురువు ఉస్మాన్ ను సత్కరించారు. ఆయన చేత పార్టీ జెండాను ఎగురవేయించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.












Click it and Unblock the Notifications
