చిరు ప్రభావంపై చెప్పలేం: ధర్మాన

హైదరాబాద్: విధివిధానాలు ప్రకటించిన తర్వాతనే చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ప్రభావంపై మాట్లాడగలమని, అంత వరకు ఏ విధమైన అంచనాకు రాలేమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కోస్తా ప్రాంతంలో చిరంజీవి ప్రభావంపై ఇప్పుడే అంచనాకు రాలేమని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అన్ని సీట్లూ తమకే వస్తాయని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతనిధులు డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ అనడంపై ఆయన శుక్రవారం ఆ విధంగా ప్రతిస్పందించారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవసరం లేదని ప్రజలు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు అధికారంలో కొనసాగాలని, కాంగ్రెసు పాలనలోనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకోవాలని, అలా ప్రజలు కోరుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రజలు కోరుకోకుండా కూటమి, మహా కూటమి వంటివాటి వల్ల ఉపయోగం ఏమీ లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+