చిరు పార్టీలోకి బండారు సత్యానందరావు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మాజీ శాసనసభ్యుడు బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు, జిల్లా కమిటీకి ఫాక్స్ ద్వారా పంపినట్లు ఆయన తెలిపారు. ఆయన చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు 40 మంది ఎంపిటిసిలు, ఇద్దరు జడ్పీటిసిలు తెలుగదేశం పార్టీకి రాజీనామా చేశారు.
రాష్ట్రంలో మార్పునకు దోహదం చేసే చిరంజీవి పార్టీలో చేరాలని తన నియోజకవర్గం ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందని, వారి అభిప్రాయాన్ని మన్నించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బండారు సత్యానందరావు చెప్పారు. సత్యానందరావు తమ పార్టీ రాజీనామా చేయడం వల్ల నష్టమేమీ లేదని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు రాజప్ప అన్నారు. కొత్తపేట నుంచి ఆయన రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications
