చిరు ప్రమేయం లేదు: మల్లు రవి
హైదరాబాద్: కత్తి పద్మారావు కుమారుడు చేతన్, నళిని వివాహంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రమేయం లేదని కాంగ్రెస్ శాసనసభ్యుడు మల్లు రవి స్పష్టం చేశారు. పెళ్లి అయిన తర్వాత చిరంజీవి వచ్చి వధూవరులను ఆశీర్వదించారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కులాంతర వివాహాల వల్ల మార్పు సంభవిస్తుందని, కులాంతర వివాహాలను అహ్వానించాలని చెప్పారని ఆయన వివరించారు.
నళిని, చేతన్ ల వివాహం బౌద్ధమతాచారం ప్రకారం జరిగిందని, ఈ ఆచారంలో కన్యాదానం ఉండదని ఆయన చెప్పారు. నళినిని చిరంజీవి దత్తత తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలో కూడా నిజం లేదని ఆయన చెప్పారు. కాగా, తమకు న్యాయం చేయాలని నళిని తల్లిదండ్రులు మణి, సుబ్బారావు హోంమంత్రి కె. జానారెడ్డిని, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి కోరారు. తమ కొడుకు పెళ్లి వ్యవహారంలో చిరంజీవి ప్రమేయం లేదని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కత్తి పద్మారావు స్పష్టం చేశారు. కులాంతర వివాహాలు సామాజిక పరిణామాలు వేగవంతమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
