చిరంజీవి ఎవరు?: నళిని తల్లిదండ్రులు
హైదరాబాద్: తమ కూతురును దత్తత తీసుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎవరని నళిని తల్లిదండ్రులు మణి, తమ్మిన సుబ్బారావు ప్రశ్నించారు. చిరంజీవి అండదండలతోనే తమ కూతురు నళినితో తన కుమారుడు చేతన్ కు కత్తి పద్మారావు వివాహం చేశారని వారు ఆరోపించారు. చిరంజీవి అండదండలు లేకపోతే కత్తి పద్మారావు ఫిల్మ్ నగరులో వివాహం చేసి ఉండేవారు కారని వారన్నారు. శుక్రవారం శాసనసభ వద్ద వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిరంజీవికి చెందినవారే ఆ వివాహం చేశారని వారన్నారు.
శ్రీజ అలా వివాహం చేసుకున్నప్పుడు తామంతా బాధపడ్డామని, ఆ బాధ ఎలా వుంటుందో తెలిసి కూడా చిరంజీవి తమ కూతురు విషయంలో అలా వ్యవహరించడం బాధించిందని వారన్నారు. తమకు రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయని కత్తి పద్మారావు చేస్తున్న విమర్శలో నిజం లేదని వారన్నారు. చిరంజీవ అండదండలే కత్తి పద్మారావుకు ఉన్నాయని వారన్నారు. తమ కూతురు నిర్బంధించారని వారు ఆరోపించారు. తమ కూతురిని తమకు అప్పగిస్తే చాలునని వారన్నారు. చిరంజీవి తమ కూతురును దత్తత తీసుకున్నట్లు పత్రికలో చదివి తెలుసుకున్నామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
