చిరుతో ఎస్పీ సై: అమర్ సింగ్
న్యూఢిల్లీ: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో కలిసి పనిచేస్తామని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత అమర్ సింగ్ చెప్పారు. చిరంజీవితో తాను, తమ పార్లమెంటు సభ్యురాళ్లు జయా బచ్చన్, జయప్రద ఈ నెల 7వ తేదీ సాయంత్రం సమావేశం కానున్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చిరంజీవి నివాసంలోనే తమ భేటీ జరుగుతుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి పార్టీకి తాము ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు.
తమతో ఇంతకాలం సహకరించినందుకు తాము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. జయప్రద ఆంధ్రప్రదేశ్ కు చెందినవారనే విషయం తెలిసిందే. జయప్రదను రాష్ట్ర రాజకీయాల్లోకి దించి పాగా వేయాలని ఎస్పీ ఆలోచిస్తున్నది.












Click it and Unblock the Notifications
