చిరు ప్రజారాజ్యంపై టిడిపి దాడి

Yerrannaidu
హైదరాబాద్: పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవడం వల్ల ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం కాబోదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెసుకు తామే ప్రత్యామ్నాయమని చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధులు చేసిన ప్రకటనపై ఆయన శుక్రవారం ఆ విధంగా వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై పోరాడని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించని పార్టీ తామే కాంగ్రెసుకు ప్రత్యామ్నాయమంటే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తామే ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని తామే ప్రత్యామ్నాయమని ప్రజారాజ్యం అంటే సరిపోదని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఇప్పటి వరకు ఒక్క ప్రజాసమస్యపై కూడా స్పందించలేదని ఆయన అన్నారు.

అణు ఒప్పందంపై ప్రజలను, పార్లమెంటును తప్పుదోవ పట్టించిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అణు ఒప్పందంపై ప్రజల్లో తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చించడానికి యుఎన్ పిఎ, ఇతర పార్టీలు రేపు సమావేశమవుతాయని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై ప్రజలను మోసం చేసిన ప్రధాని పదవిలో కొనసాగడానికి అనర్హులని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+