మీడియాపై మిత్రా నిప్పులు

హైదరాబాద్: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా మీడియాపై నిప్పులు చెరిగారు. ప్రజారాజ్యం పార్టీకి కార్యకర్తలు కొరత వుందని వచ్చిన వార్తలపై ఆయన బుదవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రజలు రాష్ట్రంలో సుపరిపాలనను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. చిరంజీవికి ప్రజా బలం లేకపోతే పార్టీ కార్యాలయం గేట్లను తోసుకుని ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. బలం ఉంది కాబట్టే తమ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఆయన చెప్పారు. జనాన్ని చూసి వార్తలు రాయాలని మిత్రా మీడియాకు సలహా ఇచ్చారు.

తాము విమర్శలకు ప్రతిస్పందిస్తామని ఆయన చెప్పారు. రాజకీయ విధానాలపై మాట్లాడితే తాము ప్రతిస్పందిస్తామని ఆయన అన్నారు. చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే స్పందించబోమని ఆయన చెప్పారు. చిరంజీవి రాజకీయానుభవం లేదు వంటి వ్యాఖ్యలపై తాము మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఐఎఎస్ క్యాడర్ చెందిన అధికారి చంద్రశేఖర్ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి రావడం సంతోషకరమని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+