భార్గవ్ ఆర్ట్స్ గోపాలరెడ్డి కన్నుమూత

కమల్ హాసన్ ,శ్రీదేవి నటించిన తమిళ చిత్రాన్ని చిలిపి మొగుడు పేరుతో తెలుగులోకి అనువదించటంతో ఆయన నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత రెండు అనువాద చిత్రాలు తీసి మనిషికో చరిత్ర సినిమాతో స్ట్రయిట్ చిత్రాల నిర్మాణం లోకి వచ్చారు. తర్వాత బాలయ్య హీరోగా మంగమ్మ గారి మనవడు తో ప్రారంభించి ఎన్నో హిట్ సినిమాలను తెలుగు పరిశ్రమకు అందించారు. అభిరుచి గల నిర్మాతగానే కాక,ఒక మంచి వ్యక్తిగా ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications