తెలంగాణ, కోస్తాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం: బంగాళాఖాతం నుంచి తెలంగాణకు విస్తరించిన బలమైన అల్పపీడనం ఇప్పటికీ అక్కడే స్ధిరంగా ఉంది. ఇది మహారాస్ట్ర వైపు పయనించి బలహీనపడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు చెప్పారు. మహారాష్ట్రకు ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉపరితలంపై ఏర్పడిన తుపాను మరో 24 గంటల్లో అల్ప పీడనంగా మారనుంది.
ఇదే సమయంలో తెలంగాణ, కోస్తా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెకియజేసింది. కోస్తాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.












Click it and Unblock the Notifications