తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని ఓ వింత ప్రయోగం!
వినూత్న కథాంశాలు, కొత్తదనంతో కూడిన చిన్న సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అదే కోవలో గతాన్ని, వర్తమానాన్ని ముడివేస్తూ ఆసక్తకరమైన కథనంతో రూపొందించిన సినిమా 'పారడాక్స్ హరికథ'. ఐరావత సినీ కలర్స్, అగ్‌మైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కడ్లూరి అశోక్, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర ఈ సినిమాను నిర్మించారు. అనుదీప్ రెడ్డి కొతూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆకట్టుకుంటున్న 'గుప్పెడంత ప్రేమ' సాంగ్
డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఘనంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్రబృందం బుధవారం నాడు 'గుప్పెడంత ప్రేమ' అంటూ సాగే ఓ మధురమైన ప్రేమ గీతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు.

తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కొత్త పాయింట్: డైరెక్టర్ అనుదీప్ రెడ్డి
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా వినూత్నమైన సినిమా అని.. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు టచ్ చేయని ఓ సరికొత్త అంశాన్ని ఇందులో చూపించామని వెల్లడించారు. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా ఓ కొత్త తరహా అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. చిన్న సినిమాల విజయాల జాబితాలో ఈ సినిమా కూడా కచ్చితంగా చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 11న విడుదలవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి విజయం చేకూర్చాలని కోరుతున్నామన్నారు.
నిర్మాత అశోక్ కడ్లూరి మాట్లాడుతూ .. ''పారడాక్స్ హరికథ' గొప్ప చిత్రంగా నిలుస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ మూవీ కోసం అందరూ కష్టపడి పని చేశారు. అన్ని రకాల హంగులతో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని తెలిపారు.
'మసూద'లో ముసుగులో చూశారు.. ఇందులో అసలు రూపంతో వస్తున్నా: అఖిల రామ్
నటి అఖిల రామ్ మాట్లాడుతూ.. '''పారడాక్స్ హరికథ' అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. గతంలో 'మసూద' సినిమాలో నన్ను ముసుగులో చూసి ఉంటారు. ఇప్పుడు ఆ ముసుగు తీసి, పూర్తిస్థాయి పాత్రలో మీ ముందుకు వస్తున్నాను. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు. నటి లావణ్య రెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎంతో శ్రమించాం. ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యాం. అయితే, చిన్న సినిమాల రిలీజ్ విషయంలో మేం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాం. 'హరికథ'లో అద్భుతమైన కంటెంట్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పిస్తుంది. మా ప్రయత్నానికి మీడియా, ఆడియెన్స్ అండగా నిలవాలని కోరుకుంటున్నాను'' అని విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
