చిరుతో కలిసిన ఐఎఎస్ పై ఆరోపణలు, ఖండనలు
హైదరాబాద్: చిరంజీవి పార్టీలో చేరిన ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్ తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలను తిప్పికొట్టారు. కొందరు రాజకీయ లబ్ది కోసం తన మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన శనివారం వివరణ ఇ చ్చుకున్నారు. తెలుగువారైన చంద్రశేఖర్ మహారాష్ట్ర కేడర్ ఐఎఎస్ అధికారి. ఆయన ముంబయ్ మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని నిన్న చిరంజీవి పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ రావడంతో చిరు శిబిరం ఉలిక్కి పడింది. నేడు చంద్రశేఖర్ ఒక ప్రముఖ దినపత్రికలో సగం పేజి కలర్ యాడ్ ఇవ్వడం ఇంకా వివాదాస్పదమైంది. నెలకు యాభై వేల జీతానికి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ధారాళంగా ప్రచారానికి లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేయగలుగుతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications