చిరంజీవి పార్టీ అలాంటిదే: నాగం
హైదరాబాద్: చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తమిళనాడులో విజయ కాంత్ పెట్టిన పార్టీలాంటిదేనని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఈ విషయాన్ని ఇంతకు ముందు చెప్పాం, ఇప్పుడూ చెబుతున్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవికి ఇప్పుడే చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా అని ఆయన అడిగారు. చిరంజీవికి ఇంతకు ముందు ఎప్పుడైనా చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ పెట్టారు కాబట్టి ఓట్ల కోసమే చిరంజీవి ఇప్పుడు చేనేత కార్మికులను పరామర్శించారని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications