కోడెల శివప్రసాదరావు దీక్ష విమరణ
గుంటూరు : ఎరువుల పంపిణీ కోసం చేస్తున్న దీక్షను తెలుగుదేశం పార్టీ నాకుడు మాజీమంత్రి కోడెల శివప్రసాదరావు ఆదివారంనాడు విరమించారు. జిల్లా అధికారులతో జరిగిన చర్చల్లో తనకు స్పష్టమైన హామీ లభించడంతో దీక్ష విరమిస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే పదిరోజుల్లోగా అధికార్లు తనకిచ్చిన హామీను నిలబెట్టుకోకపోతే తిరిగి దీక్షకు ఆందోళనకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
రైతులకు సక్రమంగా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రెండు రోజుల క్రితం నర్సారావుపేటలో దీక్షను ప్రారంభించారు. ఎరువుల పంపిణీ సరిగా లేకపోవడంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితుల్లో ఆయన దీక్ష చేపట్టారు. పార్టీల ప్రమేయం లేకుండా ఎరువులను అందరికీ సక్రమంగా అందేలా చూస్తామని అధికారులు తనకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
