ప్రత్యేక ప్యాకేజీకి తెరాస డిమాండ్
కరీంనగర్ : సిరిసిల్ల చేనేత కార్మికులకు ఆదుకునేందుకు రూ.500 కోట్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్రసమితి (తెరాస) డిమాండ్ చేసింది. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పార్టీ ప్రతినిధిబృందం పరామర్శించింది. ప్రభుత్వ విధానాల వల్లనే చేనేత రంగం సంక్షోభంలో పడిపోయిందని వారు ఆరోపించారు. తెరాస ప్రధాన కార్యదర్శి కె.టి. రామారావు నాయకత్వంలో ఈ ప్రతినిధి బృందం సిరిసిల్లను సందర్శించింది.
శనివారం సిరిసిల్లలో ముగ్గురు చేనేత కార్మికులు ఆత్యహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను తెరాస నాయకులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు కూడా బాధితులను పరామర్శించారు. మంత్రులను అడ్డుకోవడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
