ఢిల్లీలో రైస్ , సంతకాలు ఇప్పట్లో లేవు
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఆమె ఈ పర్యటన సమయంలో 123 అణు ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం లేదు. ఈ ఒప్పందంపై సంతకానికి మధ్యాహ్నం రెండు గంటల సమయాన్ని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నాయి. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన శాసనంపై అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సంతకాలు చేయడానికి అనేక లాంచనాలు ఉన్నందున ఈ ఒప్పందంపై నేడు సంతకాలు జరిగే అవకాశం లేదు. నేడు రైస్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని చర్చలు జరుపుతారు.
సంతకాలు ఇప్పుడే కాదు
వాషింగ్టన్ : అణుఒప్పందంపై సంతకాలు తన భారత పర్యటనలో జరిగే అవకాశాలు తక్కువేనని అమెరికా విదేశాంగమంత్రి కండోలిజా రైస్ అన్నారు. ఈ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ రెండు రోజుల క్రితమే ఆమోదించిందని ఇంకా అనేక పాలనాపరమైన వ్యవహారాలు ఉన్నాయని ఆమె అన్నారు. భారత్ పర్యటనకు వెళుతున్న ఆమె ప్రయాణ సమయంలో విలేకరులతో మాట్లాడారు. భారత్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేసివస్తారా అని వారు అడగగా అమె పై సమాధానం చెప్పారు.












Click it and Unblock the Notifications