తానాలో చీలిక: ప్రభాకర చౌదరి తొలిగింపు
హైదరాబాద్: అమెరికాలోని తెలుగువారి సంక్షేమం కోసం, సాంస్కృతిక వికాసం కోసం ఏర్పడిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) రెండుగా చీలిపోయింది. తానా గవర్నింగ్ బాడీ అధ్యక్ష పదవి నుంచి ప్రభాకర చౌదరిని తొలగించినట్లు ఇక్కడికి సమాచారం అందింది. ప్రభారక చౌదరిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ 20 మంది సభ్యులతో కూడిన గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో ప్రభాకర చౌదరి అట్లాంటాలో అసాధారణ తానా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికైన ప్రభాకరచౌదరిని తొలగించే అధికారం గవర్నింగ్ బాడీకి లేదని ముక్కామల అప్పారావు అంటున్నారు. కాల పరిమితి ముగిసే వరకు ప్రభాకర చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాలే ఈ చీలికకు కారణమని చెబుతున్నారు. తానాను అడ్డం పెట్టుకుని కొందరు రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించాలని చూస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై ప్రభాకర చౌదరికి, గవర్నింగ్ బాడీ సభ్యులకు మధ్య ఏడాదిగా ఇ-మెయిల్స్ యుద్ధం సాగుతోంది. చివరకు అది చీలికకు దారి తీసింది.












Click it and Unblock the Notifications