మహిషమర్థిని గా అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఇవాళ ఆశ్వయజ శుద్ద అష్టమి కావడంతో అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఎనిమిదవ రోజు శ్రీదుర్గా దేవీగా కనిపించనున్నారు. దీన్ని దుఃఖేన గంతుం శక్యతే ఇతి దుర్గా అంటారని పండితులు చెబుతున్నారు. అలాంటి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి అష్టమీ తిథి రోజు రురుకుమారుడైన దుర్గముడు అనే రాక్షసున్ని సంహరించింది.
దుర్గాదేవి ఆదిప్రకృతి మహా పంచమ స్వరూపాలలో ఇది మొదటిదని వేద పండితులు చెబుతున్నారు. ఇక ఇంద్రకీలాద్రి పర్వతం భక్తుల స్తోత్ర నామాలతో మారుమోగిపోతోంది. సమస్తమైన దుర్గతుల నుంచి రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని నియమపూర్వకంగా జపిస్తే సమస్త బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.












Click it and Unblock the Notifications
