నిలకడగా అమితాబ్ ఆరోగ్యం
ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను లీలావతి ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అమితాబ్ కు వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమితాబ్ కోలుకుంటున్నారని, ఏ విధమైన ఇబ్బందులు లేవని పరీక్షల్లో తేలిందని, కొద్ది రోజుల్లో అమితాబ్ ఇంటికి వెళ్లవచ్చునని లీలావతి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేంద్ర త్రివేది చెప్పారు.
అభిషేక్ బచ్చన్ ఆదివారం ఉదయం తండ్రి అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అమితాబ్ కు చేస్తున్న వైద్యం గురించి వైద్యులు ఆయనకు వివరించారు. తాము అమితాబ్ గుండె పరిస్థితిని తెలుసుకోవడానికి ఇసిజి, 2డి ఎకో పరీక్షలు చేశామని నరేంద్ర త్రివేది చెప్పారు. అవసరమైతే ఆల్ట్రా సోనోగ్రఫీ, సిటి స్కాన్ చేస్తామని ఆయన చెప్పారు. రక్త పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications