నిశబ్ద విప్లవం సాధిద్దాం: చిరంజీవి

Chiranjeevi
విశాఖపట్నం: రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం సాధిద్దామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి యువతకు పిలుపునిచ్చారు. చిరంజీవి ప్రజా అంకిత యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లాలో కొనసాగింది. వచ్చే నాలుగైదు నెలల్లో విశేషమైన మార్పు తేగలమనే నమ్మకం కుదురుతోందని ఆయన రావికమతం రోడ్ షోలో అన్నారు. పెద్దల ఆలోచనలను యువత మార్చాలని, మన కర్మ అనుకునే పద్ధతిని మానేసి మన జీవితాలను మార్చుకుందామని ఆయన అన్నారు. యువతదే భవిష్యత్తు అని ఆయన అన్నారు. మన కనీసావసరాలను తీర్చుకునేందుకు తగిన మార్పు తెద్దామని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీని అశీర్వదించి మార్పునకు దోహదం చేయాలని ఆయన ప్రజలను కోరారు. సంతోషాంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని ఆయన అన్నారు. ప్రజల గురించి ఆలోచించని రాజకీయ నాయకులకు ఓట్లేసి గెలిపిస్తున్నామని ఆయన అన్నారు. మన జీవితాలను మనమే మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అమాయకత్వం వీడి ఆలోచన పెంచుకోవాలని, పెద్దల ఆలోచనల్లో మార్పు రావడానికి యువత కృషి చేయాలని ఆయన అన్నారు. నాలుగైదు నెలల్లో మనం విశేషమైన మార్పు సాధించగలమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+